BMW C 400 GT: భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్‌ ఇదే, ధర ఎంతంటే?

9 Oct, 2021 11:42 IST|Sakshi

మీరిప్పటి వరకు ఖరీదైన కార్‌ను చూసుంటారు. ఖరీదైన బైక్‌ను చూసుంటారు. కానీ కాస్ట్లీ స్కూటర్‌ను చూసి ఉండరు. అయితే వచ్చే వారం మన దేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్‌ విడుదల కానుంది. ఈ స్కూటర్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ విడుదల చేయనుంది.

అక్టోబర్‌12, మంగళవారం రోజు దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ 'బీఎండబ్ల్యూ సీ 400 జీటీ' స్కూటర్‌ను లాంఛ్‌ చేయనున్నట్లు బీఎండబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు.  

 

బీఎండబ్ల్యూ సీ 400 జీటీ ఫీచర్స్‌ 
సీ 400 జీటీ 350సీసీ, సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూలెడ్‌ ఇంజిన్‌, సీవీటీ ట్రాన్స్‌మెషిన్‌, 33.5బీహెచ్‌పీ పవర్‌, 35ఎన్‌ఎం టారిక్‌, యాంగులర్ బాడీ ప్యానెల్స్, పొడవైన విండ్‌స్క్రీన్, పుల్-బ్యాక్ హ్యాండిల్‌బార్,స్టెప్డ్ సీట్, డ్యూయల్ ఫుట్‌రెస్ట్ ప్రొవిజన్‌లతో సౌకర్యంగా ఉంటుంది. ఎల్‌ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్, ఏబీఎస్‌, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్,బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అట్రాక్టీవ్‌ ఫీచర్లు ఉన్నాయి. 

ధర ఎంతంటే? 
బీఎండబ్ల్యూ సీ400 జీటీ  బ్లూమ్యాక్సీ (ఫీచర్స్‌ పెద్దగా ఉండే) స్కూటర్. హైవేపై సుధీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండే బైక్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.5లక్షలని బీఎండబ్ల్యూ సంస్థ తెలిపింది. స్కూటర్ ప్రీ బుకింగ్‌ కోసం లక్షరూపాయిలు కట్టాల్సి ఉంది. ఇప్పటికే భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్‌' అనే ప్రచారం జరగడంతో దేశంలో ఇప్పటి వరకు 100 బుకింగ్‌లు పూర్తయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.

చదవండి: కారుని ఇలా కూడా తయారు చేస్తారా!

మరిన్ని వార్తలు