BMW Motorrad 2022: బీఎండబ్ల్యూ కొత్త బైక్స్‌, ధర తెలిస్తే షాక్‌!

17 Aug, 2022 16:50 IST|Sakshi

బీఎండబ్ల్యూ  మోటోరాడ్ 2022  లాంచ్‌

ఫ్రెష్‌ లుక్స్‌, డైనమిక్‌ ఫీచర్లు

సాక్షి,ముంబై: అంత్యంత ఖరీదైన బైక్స్‌ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ సిరీస్‌లో 2022 బైక్స్‌ మోడల్స్‌ను   ఇండియా మార్కెట్లలో లాంచ్‌ చేసింది. లగ్జరీ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ 2022 మోడల్స్‌ బైక్స్‌ని ప్రీమియం టూరింగ్‌ రేంజ్‌లో  బీఎండబ్ల్యూ ఇండియా తీసుకొచ్చింది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ అయిన కే 1600 గ్రాండ్ అమెరికా ధర రూ. 33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గాను, బేస్‌ వేరియంట్‌ ఆర్‌1250 ఆర్‌టీ ధరను రూ. 23.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గాను కంపెనీ నిర్ణయంచింది.

R1250 RT, K 1600 బాగర్, K 1600 GTL,  K 1600 గ్రాండ్ అమెరికా  ఇలా నాలుగు వేరియంట్లలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022  బైక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభం. ఫ్రెష్‌ లుక్స్‌, డైనమిక్స్‌ ఫీచర్లతో పాటు, లెజెండరీ 2-సిలిండర్ బాక్సర్ ఇంజన్ బీఎండబ్ల్యూ ShiftCam లాంటి స్పెషల్‌ ఫీచర్లతో లాంగ్‌ హైవే రైడర్లకు  స్మూత్‌ రైడింగ్‌ ఫీలింగ్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. 

కే1600లో 6సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్ అమర్చింది.ఇది  6750 RPM వద్ద 160 HPని,  5250 RPM వద్ద 180 Nm ఉత్పత్తి చేస్తుంది.  ఇక R 1250 RT లో 1254 cc    ఇంజీన్‌ 7750 RPM వద్ద 136 HP, 6250 RPM వద్ద 143 Nm శక్తిని అందిస్తుంది.


 బీఎండబ్ల్యూ కే-1600 GTL డ్రాగ్ టార్క్ కంట్రోల్ (డైనమిక్ ఇంజన్ బ్రేక్ కంట్రోల్),  డైనమిక్ ESA పవర్‌ట్రెయిన్‌, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కనెక్టివిటీ, కొత్త 10.25-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే అద్భుతమైన రీడబిలిటీ , స్పష్టమైన మెను నావిగేషన్‌, ఆడియో సిస్టమ్ 2.0 ఫీచర్‌ను జోడించింది.

ఈ కొత్త బైక్స్‌ వివిధ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్‌ను సొంతం చేసుకున్న కస్టమర్లకు బీఎండబ్ల్యూ పలు ఆఫర్లు కూడా ఇస్తోంది.  అన్‌ లిమిటెడ్‌ కిలీమీటర్లు,  3 సంవత్సరాల పాటు ప్రామాణిక వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, 24×7 365-రోజుల బ్రేక్‌డౌన్ ప్యాకేజీ లాంటివి ప్రకటించింది. 

మరిన్ని వార్తలు