భారత మార్కెట్‌లోకి రానున్న తొలి బీఎండబ్ల్యూ మాక్సి స్కూటర్‌..!

18 Jul, 2021 22:53 IST|Sakshi

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ భారత మార్కెట్‌లోకి కొత్త మ్యాక్సీ-స్కూటర్‌ను టీజ్ చేసింది. ఈ బైక్‌ భారత్‌లో తొలి మ్యాక్సి-స్కూటర్‌ అని కంపెనీ పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా మ్యాక్సి స్కూటర్ పేరును ఇంకా వెల్లడించలేదు. కొత్త మాక్సి-స్కూటర్ కంపెనీ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి రెండు మిడ్-సైజ్ మ్యాక్సీ-స్కూటర్లలో ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది. బీఎండబ్యూ మోట్రాడ్ తన పోర్ట్‌ఫోలియోలో బీఎండబ్యూ సీ400ఎక్స్‌,బీఎండబ్యూ సీ400జీటీలను కలిగి ఉంది. ఈ బైక్‌లను ఈ సంవత్సరం ప్రారంభంలో అప్‌డేట్‌ చేశారు.

రెండు స్కూటర్లు 350 సిసి ఇంజన్లను కలిగి ఉంది, కాగా భారత్‌లో బీఎండబ్యూ మాక్సి-స్కూటర్‌లో భాగంగా బీఎండబ్యూ సీ400జీటీను మార్కెట్లలోకి విడుదల చేయవచ్చునని ఆటోమొబైల్‌ నిపుణులు భావిస్తున్నారు. 2018లో బీఎండబ్యూ సీ400జీటీ మ్యాక్సి బైక్‌ను లాంఛ్‌ చేసింది. భారత మార్కెట్‌లో బైక్‌ ఎక్స్‌ షో రూమ్‌ ధర 6 లక్షలపైనా ఉంటుందని తెలుస్తోంది. బీఎండబ్యూ మ్యాక్సి బైక్‌ సింగిల్‌ సిలిండర్‌, 350సీసీ ఇంజన్‌ సామర్థ్యంతో రానుంది. బైక్‌లో అప్‌డేటేడ్‌ త్రోటెల్‌ బై వైర్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు.  33.5 బీహెచ్‌పీ ఇంజన్‌ 35ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

మరిన్ని వార్తలు