BMW i Vision AMBY : ది సూపర్​ ఎలక్ట్రిక్‌ సైకిల్..! రేంజ్‌ తెలిస్తే షాక్‌..!​

7 Sep, 2021 21:00 IST|Sakshi

మ్యునీచ్‌: జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ మోటార్‌ షోలో బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి వచ్చే రెండు ఎలక్ట్రిక్‌ బైక్లను ప్రదర్శనకు ఉంచింది.  హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌  సైకిల్‌, లో స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ బైక్లను బీఎమ్‌డబ్ల్యూ ఐఏఏ-2021 మొబిలిటీ షోలో టీజ్‌ చేసింది. ఈ షోలో భాగంగా బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్‌ సీఈ-02 ఎలక్ట్రిక్‌ బైక్‌ను, బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్‌ ఏఎమ్‌బీవై ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది
చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌..! చూస్తే వావ్‌ అనాల్సిందే..!


రేంజ్‌లో రారాజు..!
బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్‌ AMBYఎలక్ట్రిక్‌ సైకిల్‌ ఫీచర్స్‌ తెలిస్తే ఔరా అనాల్సిందే..! ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్‌ AMBYసైకిల్‌ సంచలానాన్ని నమోదు చేయనుంది. బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్‌ AMBYసైకిల్‌లో అధిక శక్తి గల మోటార్‌, అత్యధిక సామర్థ్యం ఉన్న 2000Wh బ్యాటరీని ఏర్పాటుచేసింది. బ్యాటరీ ఏర్పాటుచేయడంతో ఒక్క సారి చార్జ్‌ చేస్తే నార్మల్‌ పవర్‌ మోడ్‌లో ఈ సైకిల్‌ సుమారు 300 కిమీ దూరం మేర ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఈ-సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్‌ యాప్‌నుపయోగించి కూడా ఆపరేట్‌ చేయవచ్చును. ఈ సైకిల్‌ కనిష్టంగా గంటకు 25 వేగంతో, గరిష్టంగా 60 కిమీ వేగంతో ప్రయాణించనుంది. ఈ బైక్‌లో సరికొత్త జియోఫెన్సింగ్‌ మోడ్‌ను ఏర్పాటుచేశారు.  ఈ మోడ్‌తో బైక్‌ ఆటోమోటిక్‌గా స్పీడ్‌ను నియంత్రిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ఈ సైకిళ్లను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నట్లు బీఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. 

చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు..!

మరిన్ని వార్తలు