ప్రత్యర్థులు గుండెల్లో గుబులు.. బీఎండబ్ల్యూ నుంచి మరో కారు లాంచ్

30 Mar, 2023 15:30 IST|Sakshi

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో 2023 ప్రారంభం నుంచి కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని లాంచ్ చేసింది. ఇది ఎక్స్3 లైనప్‌లో చేరిన కొత్త వేరియంట్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

ధర:
భారతదేశంలో విడుదలైన కొత్త బీఎండబ్ల్యు ఎక్స్3 20డి ఎక్స్‌లైన్ (BMW X3 20d xLine) ధర రూ. 67.5 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ కారు ధర దాని మునుపటి అవుట్‌గోయింగ్ లగ్జరీ ఎడిషన్ ఎక్స్3 కంటే రూ. 20,000 ఎక్కువ.

డిజైన్:
బీఎండబ్ల్యు ఎక్స్3 ఎక్స్‌లైన్ కిడ్నీ గ్రిల్‌తో మునుపటి అదే స్టైలింగ్‌ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్‌, వెనుక భాగం మొత్తం విస్తరించి ఉండే టెయిల్ లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌, గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఎక్స్‌టీరియర్ లైన్స్, రూఫ్ రైల్స్‌, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

(ఇదీ చదవండి: భారత్‌లో మసెరటి రూ. 3.69 కోట్ల సూపర్‌కార్‌ విడుదల - పూర్తి వివరాలు)

ఫీచర్స్:
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్3 ఎక్స్‌లైన్ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ కలిగి హెడ్స్-అప్ డిస్‌ప్లే, 3D వ్యూ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్-కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ & పనితీరు:
కొత్త BMW X3 మోడల్ 2-లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది. తద్వారా అద్భుతమైన పనితీరు లభిస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 213 కిలోమీటర్లు.

(ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!)

ప్రత్యర్థులు:
భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బిఎండబ్ల్యు ఎక్స్3 కారు వోల్వో ఎక్స్‌సి60, ఆడి క్యూ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ కొత్త లగ్జరీ కారు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్‌లో మాత్రమే లభిస్తుంది.

మరిన్ని వార్తలు