‘బి న్యూ మొబైల్స్‌’ వార్షికోత్సవ ఆఫర్లు

1 Sep, 2021 04:12 IST|Sakshi

ఈ నెల్లోనే 10 కొత్త షోరూమ్‌లు

సంస్థ ఈడీ సాయి నిఖిలేష్‌

హైదరాబాద్‌: గొలుసుకట్టు మొబైల్‌ విక్రయశాలల సంస్థ ‘బి న్యూ మొబైల్స్‌’ సంస్థ ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ షోరూమ్‌ల సంఖ్యను 108కు పెంచుకుంది. అంతేకాదు ఈ నెలలోనే కొత్తగా 10 షోరూమ్‌లను ప్రారంభించబోతున్నట్టు ‘బి న్యూ మొబైల్స్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యర్రగుంట్ల సాయి నిఖిలేష్‌ తెలిపారు. శామ్‌సంగ్, ఐఫోన్, రెడ్‌మీ, రియల్‌మీ, వన్‌ప్లస్‌ వన్, వివో, ఒప్పో, తదితర ఎన్నో బ్రాండ్‌ల మొబైల్‌ ఫోన్లను అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రముఖ బ్రాండ్ల టెలివిజన్‌లతోపాటు, ల్యాప్‌టాప్‌లు, హోం థియేటర్లు, వాటర్‌ ప్యూరిఫయర్లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అమెజాన్‌ పే ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.900 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్టు చెప్పారు. ఐసీఐసీఐ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ క్యాష్‌బ్యాక్‌.. జస్ట్‌మనీ ద్వారా కొనుగోలు చేస్తే ఒక నెల ఈఎంఐ ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పేటీఎం ద్వారా కొనుగోళ్లపై 11శాతం క్యాష్‌ బ్యాక్‌ తదితర ఆఫర్లను  ఇస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు