భారత్‌లో బోయింగ్‌ గ్లోబల్‌ సపోర్ట్‌ సెంటర్‌

15 Feb, 2023 04:38 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్‌ సపోర్ట్‌ సెంటర్‌ (జీఎస్‌సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్‌లైన్‌ కస్టమర్లు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలు, ఇతరత్రా పరిశ్రమ వర్గాలకు నిర్వహణపరమైన సామర్థ్యాలు.. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన సేవలను జీఎస్‌సీ అందిస్తుంది.

జీఎస్‌సీ, లాజిస్టిక్స్‌ కేంద్రంపై ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం సంస్థ వెల్లడించలేదు. దేశీ విమానయాన సంస్థలు 150 పైచిలుకు బోయింగ్‌ విమానాలను నడుపుతున్నాయి. తమ రిపేర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ సస్టెయిన్‌మెంట్‌ హబ్‌ ప్రోగ్రాం ద్వారా బోయింగ్‌ ప్రస్తుతం స్థానిక కస్టమర్లకు వివిధ సర్వీసులను అందిస్తోంది. దేశీయంగా విమాన ప్రయాణాలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో వినూత్న అవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు, ఏవియేషన్‌ వ్యవస్థను ఆధునీకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బోయింగ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సలిల్‌ గుప్తే తెలిపారు.

మరిన్ని వార్తలు