బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా: నియామకాల జోరు

7 Apr, 2021 13:21 IST|Sakshi

సాక్షి,ముంబై: కోవిడ్‌-19 కాలంలోనూ దేశంలో 3,000 కొత్త నియామకాలు చేపట్టినట్టు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బీఓఎఫ్‌ఏ) తెలిపింది. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ వృద్ధి చెందగల సామర్థ్యం ఉందని భారత్‌ తన సత్తాను ప్రపంచానికి చాటిందని సంస్థ కంట్రీ హెడ్‌ కాకు నఖటే అన్నారు.   (టెక్‌ జాబ్స్‌లో తగ్గని జోష్‌!)

‘భారత్‌లో చాలా ఎక్కువ మందిని తీసుకున్నాం. ఇతర ఎంఎన్‌సీలు సైతం ఇదే మాదిరిగా నియామకాలు జరిపాయి. ఖర్చు తక్కువ కావడంతో బ్యాక్‌ ఆఫీస్‌ పనుల కోసం భారత్‌లో ఉద్యోగులను ఈ కంపెనీలు రంగంలోకి దింపాయి. మహమ్మారి సమయంలో యూఎస్‌లో రిటైల్, చిన్న వ్యాపార రుణాల్లో పెరుగుదల నమోదైంది. ఈ రుణాలు భారత్‌కు చేరాయి. ఇక్కడి కంపెనీల్లో 47 బిలియన్‌ డాలర్లకుపైగా నిధులను అందించి ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌ కీలక పాత్ర పోషించాయి’ అని వివరించారు. ముంబై, హైదరాబాద్, గురుగ్రాం, చెన్నై, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు చెందిన గ్లోబల్‌ బిజినెస్‌ సెంటర్స్‌లో 23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు