వండర్‌షెఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కృతి సనన్‌

13 Sep, 2021 11:13 IST|Sakshi

హైదరాబాద్‌: కిచెన్‌వేర్‌ తయారీ సంస్థ వండర్‌షెఫ్‌ తాజాగా ప్రముఖ నటి కృతి సనన్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆరోగ్యం, ఆహారం, సంప్రదాయం, ఆధునికత, కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే కృతి.. తమ బ్రాండ్‌కు సరైన ప్రతినిధిగా ఉండగలరని కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ రవి సక్సేనా తెలిపారు.

ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెంచేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన ప్రకటనలను డిజిటల్‌ సహా పలు మాధ్యమాల్లో ఇస్తున్నట్లు సక్సేనా తెలిపారు.
  

మరిన్ని వార్తలు