బాలీవుడ్‌ నటి చేతికి కళ్లు చెదిరే లగ్జరీ కారు: వైరల్‌ వీడియో

6 Mar, 2023 22:02 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా లగ్జరీ  కారును కొనుగోలు చేసింది. ఎంజీ గ్లోస్టర్ కొత్త  SUVని కొనుగోలు చేసింది. దీని ధర  సుమారు రూ.42 లక్షలు.  గ్లోస్టర్. విలాసవంతమైన కారును కొనుగోలు చేసిన షెర్లిన్‌ చోప్రా  ఫోటో, వీడియో   ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇండియాలో లభిస్తున్న ఎంజీ  ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎస్‌యూవీ గ్లోస్టర్. దీని ప్రారంభ ధర రూ. 32.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే తాజా నివేదికల ప్రకారం, షెర్లిన్ చోప్రా కొనుగోలు చేసిన మోడల్  ధర సుమారు రూ. 42.48 లక్షలు. గతంలో ఎంటీవీ స్ప్లిట్స్‌ విల్లా ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసిన షెర్లిన్ చోప్రా, నటి మోడల్‌ కూడా. తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇంగ్లీషు సినిమాల్లోనూ నటిస్తోంది. షెర్లిన్ చోప్రా రెండు టెలివిజన్ రియాలిటీ షోలతోపాటుబిగ్ బాస్ సీజన్ 3లో  కూడా కనిపించింది.

ఎంజీ గ్లోస్టర్ SUVలో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, మోటరైజ్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంటర్నల్‌ ఎయిర్ ప్యూరిఫైయర్‌తో సహా అనేక సౌకర్యవంతమైన  ఫీచర్లు ఉన్నాయి.  2022  ఎంజీ గ్లోస్టర్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సెమీ-పారలల్ పార్కింగ్, అటానమస్ బ్రేకింగ్, లేన్ కీపింగ్ ఎయిడ్, అలాగే స్టాండర్డ్ ఫ్రంట్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) ఉన్నాయి. ఇది  పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్‌తో కొనుగోలు చేయవచ్చు.  2.0L డీజిల్ ఇంజన్ కోసం ఒకే టర్బో లేదా ట్విన్ టర్బోలను కలిగి ఉంటుంది.  టయోటా ఫార్చ్యూనర్ , ఇసుజు  MU-X వంటి వాటితో పోటీ పడుతోంది.  ధర పరంగా జీప్ మెరిడియన్, హ్యుందాయ్ టక్సన్ ,కియా కార్నివాల్ వంటి వాహనాలతో పోటీపడుతుంది.

మరిన్ని వార్తలు