BookMyShow: తప్పని కోవిడ్‌ కష్టాలు

11 Jun, 2021 11:34 IST|Sakshi

200ల మంది ఉద్యోగులకు ఉద్వాసన

వెబ్‌డెస్క్‌ : ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ బుక్‌ మై షోపై కోవిడ్‌ ఎఫెక్ట్‌ పడింది. కరోనా సంక్షోభ సమయంలో ఛారిటీ సేవల్లో ముందున్న ఈ సంస్థకు కష్టాలు తప్పలేదు. చాలా రోజులుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో రెండు వందల మంది ఉద్యోగులను బయటకు పంపింది. ఈ మేరకు బుక్‌ మై షో ఫౌండర్‌, సీఈవో ఆశీష్‌ హేమ్‌రజనీ ప్రకటించారు. 

నైపుణ్యం కలవాళ్లు
కరోనా ప్యాండమిక్‌ కష్టకాలంలో తామంతా కలిసికట్టుగా పని చేశామని, ఎంతో మందికి సేవలు అందించినట్టు ఆశీష్‌ పేర్కొన్నారు. అయితే పరిస్థితులు గాడిన పడకపోవడంతో ఎంతో కష్టంగా 200 మంది ఉద్యోగులను వదులుకున్నట్టు ఆయన చెప్పారు. కంపెనీ వదులుకున్న ఉద్యోగులంతా  నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వారని, ఎవరైనా వాళ్లకి అవకాశం ఇవ్వాలంటూ ట్విట్టర్‌ వేదికగా ఆశీష్‌ కోరారు. 

15 నెలలుగా
ఈ కామర్స్‌ రంగం మొగ్గదశలో ఉన్నప్పుడు 1999లో ఆశీష్‌ హేమ్‌రజనీ బుక్‌మైషో ను ప్రారంభించారు. అంచెలంచెలుగా దేశమంతటా తమ సర్వీసులు విస్తరించారు. అయితే కరోనా కారణంగా ఈవెంట్స్‌, సినిమా థియేటర్లు మూత పడటంతో బుక్‌ మై షో పరిస్థితి తారుమారైంది. దాదాపు 15 నెలలుగా బుక్‌ మై షో నామమాత్రపు సేవలు అందిస్తోంది. 

చదవండి: 5జీతో ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు

మరిన్ని వార్తలు