అదానీకి మరో షాక్‌, జో జాన్సన్‌ గుడ్‌బై, ఎవరీ జాన్సన్‌?

3 Feb, 2023 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ హిండెన్‌ బర్గ్‌ సాగా కొనసాగుతోంది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూ​​కే ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జో జాన్సన్ అదానీ సామ్రాజ్యంనుంచి తప్పుకున్నారు. లండన్‌కు చెందిన అదానీలతో సంబంధం ఉన్న ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో జాన్సన్ రాజీనామా  చేశారు. (ట్రేడర్లకు అలర్ట్‌: అదానీ షేర్ల పతనం, ఎన్‌ఎస్‌ఈ కీలక నిర్ణయం)

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవీ)తో ముడిపడి ఉన్న యూకే ఆధారిత పెట్టుబడి సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌షిప్‌కు ఆయన గుడ్‌ బై చెప్పారు. ఫిబ్రవరి 1న జో జాన్సన్ డైరెక్టర్‌​ పదవి ఉంచి తప్పుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ధృవీకరించింది. "యూకే- ఇండియా వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు" సహకరించడానికి ఎలారాలో చేరాననీ, అప్పటికి  కంపెనీ మంచి పరిస్థితిలో ఉందని తనకు హామీ ఇచ్చారనీ తెలిపారు. అలాగే ఎలారా క్యాపిటల్ చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉందని అయితే ఆర్థిక నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక రంగాలలో ఎక్కువ డొమైన్ నైపుణ్యం  అవసరమని భావించి  బోర్డుకు రాజీనామా చేసానని  జో జాన్సన్  వెల్లడించారు. (అదానీ షేర్ల బ్లడ్‌ బాత్‌: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!)

ఎలారా క్యాపిటల్‌కి.. అదానీ గ్రూప్‌కి లింక్‌ ఏంటి? 
భారతీయ కార్పొరేట్ల కోసం నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థ ఎలారా క్యాపిటల్‌. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10  బుక్‌రన్నర్‌లలో ఎలారా క్యాపిటల్‌ కూడా ఒకటి.  లార్డ్ జాన్సన్ గత ఏడాది జూన్‌లో లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ పిఎల్‌సికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎలారా క్యాపిటల్‌ను 2002లో రాజ్ భట్ క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంగా స్థాపించారు, GDR (గ్లోబల్ డిపాజిటరీ రసీదు), FCCB (ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్), లండన్ AIM మార్కర్ ద్వారా భారతీయ కార్పొరేట్లకు నిధులను సమకూరుస్తుంది. ఇది న్యూయార్క్, సింగపూర్, ముంబై, అహ్మదాబాద్ లండన్‌లలో పూర్తి లైసెన్స్ పొందిన కార్యాలయాలను కలిగి ఉంది. ఎలారా క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం 2021 వేసవి నాటికి  5.1 శాతం వాటాతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మూడవ అతిపెద్ద వాటాదారుగా ఉంది. కాగా  అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ 2022 ఏప్రిల్‌లో బోరిస్ రెండు రోజుల భారత పర్యటనలో  అదానీ చైర్మన్‌ గౌతమ్ అదానీని అహ్మదాబాద్‌లో కలిశారు. 

మరోవైపు తాజా నివేదికల ఆధారంగా అదానీ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై  తన విమర్శలను మరోసారి  ఎక్కు పెట్టింది. బోరిస్ జాన్సన్ 25 ఏళ్ల కుమారుడికి అహ్మదాబాద్‌లోని అదానీలతో కొంత సంబంధం ఉందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని లేదా జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గురువారం డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తలు