పెగాసస్ స్పైవేర్ డేంజర్ లింకులను గుర్తించండి ఇలా..?

22 Jul, 2021 18:47 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం నుంచి కరోనా కంటే ఎక్కువగా పెగసస్‌ స్పైవేర్‌ గురుంచి చర్చ కొనసాగుతుంది. వ్యక్తుల సమాచారం, కదలికలు, ఫొటోలు, మాట్లాడే కాల్స్‌ రికార్డు చేసే ఇజ్రాయిల్‌కు చెందిన ఈ పెగసస్‌ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొన్నది. ఈ స్పైవేర్ వల్ల వందలాదిమంది జర్నలిస్టులు, ఉద్యమకారులు, పార్లమెంట్‌ సభ్యులు, అధికారుల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం అంతా ఇంటలిజెన్స్‌ వ్యవస్థకు చేరిపోతుంది. ఈ ఉచ్చులో ప్రతి పక్షాలే కాదు, ప్రభుత్వ మంత్రులు, ఎంపీలూ ఉండటం విశేషం. స్పైవేర్, స్టాకర్‌వేర్‌లు యాంటీ థెఫ్ట్‌(ఫోన్‌ చోరీకి గురికాకుండా చూసేవి) అప్లికేషన్ల రూపంలో పెగసస్‌ మన ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. 

"ఒకసారి గనుక మన ఫోన్‌లోకి ప్రవేశిస్తే దీనిని గుర్తించడం చాలా కష్టం. ఇది ఒక పరికరంలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం ఫోన్ యొక్క నియంత్రణ దాని పరిదిలోకి వస్తుంది. ఇది సందేశాలను చదవగలదు, బహుళ కాలింగ్ యాప్స్ సంభాషణలను వినగలదు, కెమెరాల యాక్సిస్ దానంతట అదే తీసుకుంటుంది" అని ఎఫ్ఎస్ఎంఐ ప్రధాన కార్యదర్శి కిరణ్ చంద్ర చెప్పారు. ఇప్పటి వరకు అనేక మంది కార్యకర్తలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు, మేధావుల ఫోన్లు పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డాయి. దీని రక్షించడం కోసం ఎఫ్ఎస్ఎంఐ టెలిగ్రామ్ లో ఒక బాట్ ను ప్రారంభించింది. దీని ద్వారా అనుమానం ఉన్న లింకులను నమోదు చేస్తే అది పెగసస్‌ స్పైవేర్‌ కు చెందినా లింకు అవునా? కాదా? అని చూపిస్తుంది. అది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • మొదట ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ యాప్‌ను డౌన్ లోడ్ చేయండి.
  • టెలిగ్రామ్‌ యాప్‌ను ఓపెన్ చేశాక సెర్చ్‌ బాక్స్‌లో @fsmi_pegasus_detector_bot అని టైప్‌ చేయాలి.
  • ఇప్పుడు ఒక డిటెక్టర్‌ బోట్‌ ఓపెన్‌ అవుతుంది. దానిలో స్టార్ట్‌ అని కనిపిస్తున్న ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • తర్వాత మీ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద లింకును అందులో నమోదు చేయాలి.
  • ఆ లింక్‌ పెగాసస్‌కు సంబంధించినదో.. కాదో మీకు చూపిస్తుంది.
     
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు