ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం

17 Jun, 2021 20:20 IST|Sakshi

ప్రపంచంలో మూడో అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో కనుగొన్నారు. ఇది 1,098 క్యారెట్ల వజ్రం. ఆంగ్లో అమెరికన్(ఎఎఎల్), బీర్స్, స్థానిక ప్రభుత్వం జాయింట్ వెంచర్ లో జరిపిన తవ్వకాలలో ఇది దొరికింది. ఈ వజ్రాన్ని డెబ్స్వానా డైమండ్ కంపెనీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. గతంలో దొరికిన అతిపెద్ద వజ్రాలలో మొదటి రెండు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. మొదటి అతిపెద్ద 3,106 క్యారెట్ల వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. దీనికి కుల్లినన్ స్టోన్ అని పేరు పెట్టారు. 2015లో బోట్స్వానాలో లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల "లెసెడి లా రోనా" అనే రెండవ అతిపెద్ద వజ్రాన్ని వెలికి తీసింది.

గత 50 సంవత్సరాల చరిత్రలో డెబ్స్వానా స్వాధీనం చేసుకున్న అతిపెద్ద వజ్రం ఇది అని ఆర్మ్ స్ట్రాంగ్ చెప్పారు. ప్రాథమిక విశ్లేషణ తర్వాత ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వజ్రం అని పేర్కొన్నారు. 73 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు, 27 మి.మీ మందం కలిగిన ఈ వజ్రానిక్ ఇంకా పేరు పెట్టలేదు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వల్ల వజ్రాల అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు ఈ వజ్రం దొరకడంతో మళ్లీ మంచి రోజు వచ్చినట్లు ఖనిజాల శాఖ మంత్రి లెఫోకో మోగి తెలిపారు. డివిడెండ్లు, రాయల్టీలు, పన్నుల ద్వారా డెబ్స్వానా అమ్మకాల రూపంలో ప్రభుత్వం 80 శాతం ఆదాయాన్ని అందుకుంటుంది. ఉత్పత్తి 2020లో డెబ్స్వానా 29 శాతం పడిపోయి 16.6 మిలియన్ క్యారెట్లకు పడిపోయింది. ఈ మహమ్మారి ప్రభావం ఉత్పత్తి, డిమాండ్ రెండింటి మీద పడటంతో అమ్మకాలు 2.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. 2021లో ప్రపంచ వజ్రాల మార్కెట్ కోలుకోవడంతో 38 శాతం ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది.

చదవండి: Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట!

మరిన్ని వార్తలు