Bounce Infinity E1 vs Ola S1: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెటర్..?

7 Dec, 2021 15:29 IST|Sakshi

దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు ఈవీ తయారీ కంపెనీలు కూడా తక్కువ ధరలో మంచి వాహనలను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. దీంతో, గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం స్వదేశీ ఈవీ స్టార్టప్ బౌన్స్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనిఫినిటీ ఈ1ను లాంఛ్ చేసింది. ఈ స్కూటర్ ఓలా ఎస్1, అథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టివీఎస్ ఐక్యూబ్ వంటి ప్రత్యర్థుల స్కూటర్లతో పోటీపడనుంది.

ఇప్పటివరకు దేశంలో ఓలా ఎస్1 స్కూటర్లకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అదే స్థాయిలో బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనిఫినిటీ ఈ1కు కూడా క్రేజ్ లభిస్తుంది. ప్రజలు ఓలా ఎస్1 స్కూటర్లను కొనాలని చూస్తున్న తరుణంలో ఇనిఫినిటీ ఈ1 వచ్చింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ రెండింటిలో ఏది బెటర్..? అనే ఆలోచనలో పడ్డారు. అయితే, మనం ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది తెలుసుకుందాం..

(చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!)

బౌన్స్ ఇనిఫినిటీ ఈ1 వర్సెస్ ఓలా ఎస్1: ధర
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 చాలా తక్కువ ధరకు లభ్యం అవుతుంది. ఈ స్కూటర్ ఓలా ఎస్1 కంటే చాలా చౌక. 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కంపెనీ బౌన్స్‌. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటుచేసిన బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల ద్వారా బ్యాటరీ ఛార్జ్‌ జీరో అవ్వగానే ఆయా స్వాపింగ్‌ స్టేషన్ల నుంచి ఫుల్‌ ఛార్జ్‌ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్‌ ధర రూ.45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. మరోవైపు, ఓలా ఎస్1 బ్యాటరీ స్వాపింగ్‌ టెక్నాలజీతో రాదు. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.85,099(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 వర్సెస్ ఓలా ఎస్1: బ్యాటరీ, రేంజ్& పనితీరు
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌లో వాటర్‌ప్రూఫ్ IP67 రేటెడ్ 2 కెడబ్ల్యుహెచ్ 48V బ్యాటరీతో 39AHతో వస్తుంది, ఇది 83Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్‌ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు. ఇది BLDC హబ్ మోటార్ సహాయంతో పనిచేస్తుంది. ఇందులో మూడు రకాల విభిన్న(డ్రాగ్, ఎకో & పవర్) రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. 

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్‌ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. ఇది 2.98 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. అంటే, ఇది ఇన్ఫినిటీ ఈ1 కంటే చాలా ఎక్కువ దూరం వేగంగా పరిగెత్తగలదు.

(చదవండి: సుడిగాడు.. 2 లక్షల కోట్ల జరిమానా తప్పించుకున్నాడు)

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1తో పోలిస్తే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అదనపు ఫీచర్లతో వస్తుంది. డిజైన్ పరంగా కూడా, బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1తో పోలిస్తే ఓలా ఎస్1 మరింత స్టైలిష్, ఆధునికంగా కనిపిస్తుంది. ఇది మంచి రేంజ్ అందిస్తుంది. ట్యాబ్ లాంటి డిజిటల్ డిస్ ప్లే కనెక్టివిటీ ఆప్షన్లు, నావిగేషన్ ఫీచర్స్ ఓలా ఎస్1 మెరుగ్గా ఉంది. చివరగా చెప్పాలంటే, ఈ రెండు స్కూటర్లు వాటి వాటి ధరల పరంగా చూస్తే రెండు చాలా ఉత్తమమైనవి.
 

మరిన్ని వార్తలు