#BoycottAmazon: బాయ్‌కాట్‌ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం!

25 Jan, 2022 21:07 IST|Sakshi

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మన దేశ జాతీయ పతాకాన్ని తీవ్రస్థాయిలో అవమానించింది. రిపబ్లిక్ డేకి ముందు భారత జాతీయ జెండా ముద్రలతో ఉన్న పలు ఉత్పత్తులను తన వెబ్‌సైట్‌లో విక్రయానికి పెట్టింది. ఈ అంశంపై స్పందించిన నెటిజన్లు ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BoycottAmazon అనే ట్యాగ్ ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతుంది. అమెజాన్‌లో భారత జాతీయ పతాకాల ముద్ర ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్న ఫోటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్ చేస్తూ అమెజాన్‌ను బాయ్‌కాట్‌ చేయలని కోరుతున్నారు.

జాతీయ పతాకం ముద్రతో ఉన్న కమర్షియల్ ఉత్పత్తులను అమ్ముతున్నందుకు అమెజాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అమెజాన్‌పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చాక్లెట్లు, ఫేస్ మాస్క్ లు, సిరామిక్ మగ్స్, కీచైన్, పిల్లల దుస్తులు వంటి ఉత్పత్తులు జెండా ముద్రను కలిగి ఉన్నాయని ట్విట్టర్ వినియోగదారులు తెలిపారు. 2017లో కూడా కెనెడాలోని అమెజాన్ వెబ్‌సైట్‌లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు డోర్ మ్యాట్‌లను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

(చదవండి: టెక్ దిగ్గజ సీఈఓలకు పద్మభూషణ్ అవార్డ్స్..!)

మరిన్ని వార్తలు