Brahmastra: కిక్కు అంటే అదీ! ఆ షేర్లు ‘బ్రహ్మాండం’ 

12 Sep, 2022 14:16 IST|Sakshi

సాక్షి,ముంబై: బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్లుమార్కెట్లోకి మల్టీప్లెక్స్ దిగ్గజ కంపెనీలకు జాక్‌పాట్‌ తగిలింది. ఈ మూవీ  బాలీవుడ్‌ వసూళ్లు రూ.100 కోట్లు దాటడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు ఒక రేంజ్‌లో పుంజుకున్నాయి. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అందులోనూ ఇటీవలి నష్టాలతో షేర్‌ ధర తక్కువకు అందుబాటులో ఉండటంతో  మరింత ఉత్సాహం నెలకొంది. ఫలితంగా పీవీఆర్‌ షేర్‌ 4.06 శాతం లేదా రూ.74.45 మేర ఎగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో, ఈ షేర్లు గరిష్టంగా రూ.1,926.20ని తాకాయి. ఐనాక్స్ లీజర్  షేర్లు 4.5 శాతం లేదా రూ. 22.55 పైగా  ఎగిసి  రూ.516.95 వద్ద  ఉన్నాయి.  

ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనాల ప్రకారం శుక్రవారం రూ. 31.5 కోట్లు, శనివారం రూ. 37.5 కోట్లు, ఆదివారం రూ. 39.5 కోట్లు వసూలు చేసింది. ఫైనల్‌గా ఈ లెక్కే ఇంకా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆయన అంచనావేశారు. జాతీయ స్థాయిలో మంచి వసూళ్లు సాధిస్తోందని ఆదర్శ్ అన్నారు.   అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు డీలాపడటంతో  శుక్రవారం,  పీవీఆర్‌,  ఐనాక్స్ లీజర్ దాదాపు 5 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

కాగా రణబీర్ కపూర్, అలియా  నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ సినిమాలో  బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మౌని రాయ్‌తోపాటు, టాలీవుడ్‌ సీనియర్‌ హీరో  నాగార్జున  కీలక పాత్రల్లో నటించారు. అలాగే  షారుఖ్ ఖాన్‌ అతిధి పాత్రలో అలరిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ , మలయాళ భాషలలో విడుదలైంది. 18 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది. అంతేకాదు 'బ్రహ్మాస్త్రా పార్ట్ 2: దేవ్' అనే టైటిల్‌ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి.

మరిన్ని వార్తలు