శుభవార్త! వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్‌..

16 Jun, 2022 14:33 IST|Sakshi

వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్‌! అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్‌ తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు ఈ తగ్గింపు ఉండవచ్చని చెబుతున్నాయి.

ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్యులు బడ్జెట్‌ తలకిందులైపోయింది. మేలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. మనం వినియెగించే వంట నూనెలో సగానికి పైగా దిగుమతి చేసుకోవ్లాసి ఉంది.  దీంతో కేంద్రం సైతం దిగుమతి సుంకాలు తగ్గించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సన్‌ఫ్లవర్‌, సోయా, పామాయిల్‌ ధరలు తగ్గాయని ఇండియన్‌ వెజిటేబుల్‌ ప్రొడ్యుసర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

ఇప్పటికే తగ్గింపు హోల్‌సేల్‌ మార్కెట్లలో అమలకు చర్యలు మొదలయ్యాయని ఆయిల్‌ ​అసోసియేషన్‌ తెలిపింది. వారం పదిరోజుల్లో  రిటైల్‌ మార్కెట్‌లో ఎంఆర్‌పీ ధరలు కూడా తగ్గుతాయంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై రూ.10 నుంచి 15,  సోయాబీన్‌పై రూ.5 వంతున ధరలు తగ్గే అవకాశం ఉంది. 

చదవండి: బంగారం వెండి, వంటనూనెల బేస్‌ దిగుమతి రేటు తగ్గింపు

మరిన్ని వార్తలు