ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పండగే పండగ.. ఆఫీసులన్ని క్లోజ్..

24 Dec, 2022 22:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరంలో ‘నయాజోష్‌’తో విధుల నిర్వహణకు సిద్ధమయ్యేలా ఉద్యోగులను ‘రీచార్జ్‌’చేసేందుకు వివిధ కంపెనీలు సిద్ధమయ్యాయి. 2023 కొత్త ఏడాదిలో ఫ్రెష్‌గా, మరింత ఉత్సాహంగా పనిచేసేలా వారిని కార్యోన్ముఖులను చేసేందుకు వివిధ ఆఫర్లను అందజేస్తున్నాయి. రెండేళ్ల తొమ్మిది నెలలకు పైగా కోవిడ్‌ మహమ్మారి మిగిల్చిన భారం, నిరాశా, నిస్పృహల నుంచి ఉద్యోగులు బయటపడేలా చేసేందుకు పలు కంపెనీలు, ముఖ్యంగా స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. 

డిసెంబర్‌ 25 నుంచి 31 దాకా మొత్తం ఆఫీస్‌లను కొన్ని సంస్థలు షట్‌డౌన్‌ చేస్తుండగా... వారం పాటు సెలవుతో కూడిన జీతం, నూతనోత్సాహాన్ని ఇచ్చే బ్రేక్‌లు, ఆఫ్‌సైట్‌ ట్రిప్‌లు, తదితరాలకు ఇతర కంపెనీలు సై అంటున్నాయి. ఫిలిప్పీన్స్‌లోని ఓ కాస్మెటిక్స్‌ కంపెనీ ఉద్యోగులకు అదనంగా 5 రోజుల పెయిడ్‌ లీవ్స్‌ను క్రిస్మస్‌ గిఫ్ట్‌ హాంపర్‌గా ఇచ్చింది. పటగోనియా (ఓ క్లోథింగ్‌ బ్రాండ్‌), ఎయిర్‌ బీఎన్‌బీ సంస్థలు కూడా తమ ఉద్యోగులు రీచార్జ్‌ కావడానికి పెయిడ్‌ లీవ్స్‌ను ప్రకటించాయి. 

ద గుడ్‌ గ్లామ్‌ గ్రూప్, ఎన్‌కాష్, ఇన్‌ట్యూట్, అగ్నిటో, ఖాటాబుక్, ఇన్‌మొబీ, వింగీఫై, నోబ్రోకర్, సింప్లీ లెర్స్‌ వంటి పలు సంస్థలు, స్టార్టప్‌ కంపెనీలు ఈ దిశలో వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. ఈ ఏడాది ముగిసి కొత్త ఏడాది వచ్చే దాకా అంటే పూర్తి వారమంతా ‘ద గుడ్‌ గ్లామ్‌ గ్రూప్‌’షట్‌డౌన్‌ ప్రకటించింది. అలాగే ఖాటాబుక్‌ సంస్థ ఈ నెల 25 నుంచి 31 దాకా ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసింది. మరికొన్ని సంస్థలు ఆఫ్‌సైట్‌ టూర్స్‌ ప్లాన్‌ చేశాయి. 

మరిన్ని వార్తలు