బ్రిటానియా సంచలన నిర్ణయం.. 50 శాతం బాధ్యతలు వారికే !

18 Mar, 2022 10:37 IST|Sakshi

కోల్‌కతా: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. 2024 నాటికి సంస్థలో వీరి వాటాను 50 శాతానికి చేర్చనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌  వెల్లడించారు. గువాహటి ఫ్యాక్టరీలో వీరి సంఖ్య 60 శాతం ఉందని, దీనిని 65కు చేర్చనున్నట్టు తెలిపారు. మహిళా సాధికారత కోసం కంపెనీ ఇప్పటికే  స్టార్టప్‌ చాలెంజ్‌ను ప్రారంభించిందన్నారు. 

ఈ–కామర్స్, డిజిటల్‌ సర్వీసెస్‌, మొబైల్‌ వ్యాన్స్‌ ద్వారా కంటి సంబంధ చికిత్స సేవలు, పిల్లల విద్య తదితర విభాగాల్లో స్టార్టప్స్‌ కోసం 30 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నిధులు సమకూర్చామని వెల్లడించారు. మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం గూగుల్‌తో చేతులు కలిపామన్నారు.  
 

మరిన్ని వార్తలు