బుకర్‌ ప్రెజ్‌ రేసులో సంజీవ్‌ సహోతా

28 Jul, 2021 14:29 IST|Sakshi

లండన్‌: ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ కోసం ఈ ఏడాది 13 మంది రచయతలు పోటీ పడుతున్నారు. బుకర్‌ ప్రెజ్‌ లాంగ్ లిస్టులోని ఈ 13 మందిలో భారతీయ సంతతికి చెందిన సంజీవ్‌ సహోతా కూడా ఉన్నారు. ఆయన రచించిన చైనా రూమ్‌ నవల్లో వలసదారుల అనుభవాల విషయంపై నవలలో అద్భుతమైన మలుపు ఉందని జడ్జిలు ప్రశంసించారు. 1960ల్లో సంజీవ్‌ తాత బ్రిటన్‌కు వలసవచ్చారు. 2015లో సైతం ఆయన బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌ లిస్టయ్యారు. 2017లో ఆయన యూరోపియన్‌ యూనియన్‌ సాహిత్య బహుమతి అందుకున్నారు. తాజా పుస్తకం చైనా రూమ్‌ పలువురి ప్రశంసలు పొందింది. 

ప్రస్తుతం ఫ్రైజ్‌ కోసం పోటీ పడుతున్న జాబితాలో సంజీవ్‌తో పాటు గత విజేత కజో ఇషిగురో, దక్షిణాఫ్రికా రచయత డామన్‌గాలట్‌, అమెరికా రచయత రిచర్డ్‌ పవర్స్‌, శ్రీలంక రచయత అనుక్‌ అరుద్‌ప్రగాశమ్‌, కెనడాకు చెందిస రబెల్‌ కస్క్‌, అమెరికాకు చెందని నాథన్‌ హారిస్‌ తదితర లబ్దప్రతిష్టులు ఉన్నారు. ఈ 13 మంది నుంచి ఆరుగురి రచనలను షార్ట్‌లిస్ట్‌ చేసి సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు. ఈ ఆరుగురికి 2,500 పౌండ్ల బహుమతి లభిస్తుంది. అంతిమ విజేతను నవంబర్‌3న ప్రకటిస్తారు. విజేతకు 50వేల పౌండ్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. 2020లో ఈ బహుమతిని షుగ్గీ బీన్‌ అనే నవలకు స్కాటిష్‌ అమెరికన్‌ రచయత డగ్లస్‌ స్టూవార్డ్‌ అందుకున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు