McLaren: సూపర్‌కార్‌ మేకర్‌ మెక్‌లారెన్‌ కమింగ్‌ సూన్‌, ఇక దిగ్గజాలకు గుబులే!

22 Aug, 2022 18:43 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్రిటీష్ లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ, మెక్‌లారెన్ ఆటోమోటివ్ భారత మార్కెట్లోకి ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తోంది.  మరో  రెండునెలలోనే మెక్‌లారెన్ జీటీ, ఆర్టురా, 720ఎస్‌లతో  లాంచింగ్‌తోపాటు, తన సూపర్, డూపర్‌ కార్లను భారత్‌కు తీసుకొస్తోంది. అంతేకాదు మెక్‌లారెన్‌ తొలి రిటైల్ అవుట్‌లెట్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఓపెన్‌ చేయనుంది. ఈ స్పోర్ట్స్‌కార్ మేకర్‌ ఎట్టకేలకు మెక్‌లారెన్ అధికారికంగాతన బబ్రాండ్‌ ఉత్పత్తులను మొత్తంభారత్‌ కస్టమర్లకు అందించనుంది. 

మెక్‌లారెన్ ఇండియా జీటీ
ఐకానిక్ జీటీ త్వరలో భారతీయ రోడ్లపై సందడి చేయనుంది. మెక్‌లారెన్ జీటీ  దేశంలోనే తొలి అధిక-పనితీరు గల హైబ్రిడ్‌ కారుగా నిలవనుంది. ఆర్టురాతో సహా భారతీయ వినియోగ దారులకు తన ఉత్పత్తులను అందిచనుంది. 

మెక్‌లారెన్ ఇండియా 720ఎస్‌ కూపే స్పైడర్ వేరియంట్‌లలో వస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సూపర్‌ కార్‌లను ఆవిష్కరించాలనేది రేసర్, ఇంజనీర్, వ్యవస్థాపకుడు, బ్రూస్ మెక్‌లారెన్ కల. దాదాపు 6 దశాబ్దాలుగా, మెక్‌లారెన్ ప్రతి సూపర్‌కార్ , హైపర్‌కార్లతో  హైపెర్‌ ఫామెన్స్‌ ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా ఉంది.

కాగా ప్రపంచ విస్తరణ ప్రణాళికలలో కీలకమైన మార్కెట్‌గా ఇండియాను భావిస్తోంది. అయితే రానున్న మెక్‌లారెన్స్  కార్లు లంబోర్ఘిని, మెర్సిడెస్-బెంజ్ ఏఎంజీ, BMW M, మసెరటి, పోర్స్చే, జాగ్వార్  లాంటి సూపర్‌ మోడల్‌కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు