లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌

12 Jul, 2021 09:58 IST|Sakshi

ఈవారం స్టాక్‌ మార్కెట్‌ సానుకూల వాతావరణంలో ప్రారంభమైంది. బాంబే స్టాక్‌ ఎక్సేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. గత వారం నష్టాలు చవి చూసిన మార్కెట్‌... ఈవారం ఎలా ప్రారంభమవుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే ముదుపరుల భయాలను పోగొడుతూ స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో మొదలైంది.

సోమవారం ఉదయం 52,634 పాయింట్ల వద్ద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభమై గరిష్టంగా 52,685 పాయింట్లకు చేరుకుంది. ఉదయం 9:45 గంటల సమయంలో 220 పాయింట్లు లాభపడి 52,606 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి సంబంధించి 86 పాయింట్లు లాభపడి 15,776 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

ఆల్ట్రాటెక్‌ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజూకి, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్‌ యూనీలీవర్‌ సంస్థలు నష్టపోయాయి. గత వారం బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోగా.. ఈ వారం మెజారీటీ బ్యాంకు షేర్లు సానుకూల ఫలితాలు చూశాయి.

మరిన్ని వార్తలు