647 షేర్ల సర్క్యూట్‌ బ్రేకర్ల సవరణ

8 Aug, 2020 12:34 IST|Sakshi

వారాంతం నుంచీ అమల్లోకి: బీఎస్‌ఈ

జాబితాలో డీమార్ట్‌, డెల్టా కార్ప్‌, ఎవరెడీ

ఏయూ స్మాల్‌ బ్యాంక్‌, స్పైస్‌జెట్‌, కేపీఐటీ 

ఐఎఫ్‌సీఐ, జీవీకే, అరవింద్‌, ఐడీబీఐ బ్యాంక్‌

నెల్కో, ఆదిత్య బిర్లా మనీ, ఆవాస్‌ ఫైనాన్షియర్స్..‌

వారాంతం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) 647 షేర్ల సర్క్యూట్‌ బ్రేకర్లను సవరించింది. ట్రేడింగ్‌పై నిఘా సమీక్షలో భాగంగా పలు కౌంటర్ల సర్క్యూట్‌ బ్రేకర్లలో మార్పులు చేసినట్లు బీఎస్‌ఈ వెల్లడించింది. అయితే ట్రేడ్‌ టు ట్రేడ్‌(టీ2టీ) విభాగంలోకి వచ్చిన కౌంటర్లకు యధాప్రకారం 5 శాతం సర్క్యూట్‌ ఫిల్టర్‌ అమలవుతుందని తెలియజేసింది. కొన్ని కౌంటర్లను టీ2టీ విభాగం నుంచి తొలగించడంతోపాటు సర్క్యూట్‌ బ్రేకర్‌ను  20 శాతానికి పెంచింది. ఇదే విధంగా మరికొన్ని కౌంటర్ల ఫిల్టర్లను 10 శాతం నుంచి 20 శాతానికి మార్పు చేసింది. మరికొన్ని కౌంటర్లను టీ2టీ విభాగంలో చేర్చింది. వివరాలు చూద్దాం..

ఇదీ జాబితా
బీఎస్‌ఈ తాజాగా 36 స్టాకులను 5 శాతం నుంచి 20 శాతం ప్రైస్‌ బ్యాండ్‌లోకి మార్పు చేసింది. ఈ జాబితాలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, డెల్టా కార్ప్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, వాటెక్‌ వాబాగ్‌ చేరాయి. ఇదే విధంగా 10 శాతం నుంచి 20 శాతానికి చేరిన కౌంటర్లలో డీమార్ట్‌, నెల్కో, ఆవాస్‌ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, స్పైస్‌జెట్‌, అరవింద్‌, అతుల్‌ ఆటో, బీడీఎల్‌, ట్రైడెంట్‌, షాపర్స్‌ స్టాప్‌, షాలిమార్‌ పెయింట్స్‌, హిమత్‌సింగ్‌కా సీడ్‌, హింద్‌ అల్యూమినియం, ఐఎఫ్‌సీఐ, ఇగార్షీ మోటార్స్‌, ఇండియన్‌ టెరైన్‌, ఇండియన్‌ టోనర్స్‌, ఆదిత్య బిర్లా మనీ, ఏషియన్‌ గ్రానైటో తదితరాలున్నాయి. ఇక 5 శాతం నుంచి 10 శాతం ఫిల్టర్‌కు 325 కౌంటర్లు చేరాయి. వీటిలో అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌, అఫ్లే ఇండియా, బజాజ్‌ హిందుస్తాన్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌, గ్రాఫైట్‌, జీవీకే పవర్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఐబీ రియల్టీ, ఐనాక్స్‌ విండ్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌కు చోటు లభించింది. 10 శాతం నుంచి 5 శాతానికి దిగిన జాబితాలో గొదావరి పవర్‌, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌, నియోజెన్‌ కెమికల్స్‌ తదితర 6 షేర్లు చేరాయి. ఈ సవరణలన్నీ ఆగస్ట్‌ 7(శుక్రవారం) నుంచీ అమల్లోకి వచ్చినట్లు బీఎస్‌ఈ తెలియజేసింది. 

1987లో..
షేర్ల ధరల అనూహ్య పతనం లేదా ర్యాలీని నివారించేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సర్క్యూట్‌ బ్రేకర్లను అమలు చేస్తుంటాయి. ఈ విధానానికి 1987లో బీజం పడింది. 1987 అక్టోబర్‌ 19న యూఎస్‌ ఇండెక్స్‌ డోజోన్స్‌ ఒక్క రోజులోనే దాదాపు 23 శాతం కుప్పకూలింది. దీంతో సర్క్యూట్‌ బ్రేకర్ల అంశం తెరమీదకు వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగా 2001 జులై 2న ఇండెక్స్‌ ఆధారిత సర్క్యూట్‌ బ్రేకర్లు ప్రారంభమయ్యాయి. తదుపరి పలు మార్పులకు లోనైన విషయం విదితమే. ఇండెక్సుల విషయంలో ప్రస్తుతం 10 శాతం, 15 శాతం, 20 శాతంగా ఫిల్టర్లు అమలవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా