దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలు..5 రోజుల్లో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి!

22 Jul, 2022 06:47 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.., దలాల్‌ స్ట్రీట్‌లో అయిదోరోజూ కొనుగోళ్లు కొనసాగాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ అంశాలు దేశీయ మార్కెట్లో సెంటిమెంట్‌ బలపరిచాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా గురువారం సెన్సెక్స్‌ 284 పాయింట్లు పెరిగి 55,682 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84 పాయింట్లు బలపడి 16,605 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు ఏడువారాల గరిష్టం కావడం విశేషం.

ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన ఐటీ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.25%, స్మాల్‌క్యాప్‌ సూచీ ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,799 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.313 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టం(80.06) నుంచి కోలుకొని 20 పైసలు బలపడి 79.85 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  

ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా..! 
సెన్సెక్స్‌ ఉదయం ఐదు పాయింట్లు పతనమై 55,392 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్ల నష్టపోయి 16,524 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో పరిమితి శ్రేణిలో స్తబ్ధుగా కదలాడిన  సూచీలు క్రమంగా పుంజుకొని ట్రేడింగ్‌ చివర్లో అనూహ్యరీతిలో లాభాలను ఆర్జించాయి. 

5 రోజులు : రూ.10 లక్షల కోట్లు 
సెన్సెక్స్‌ అయిదు రోజుల్లో 2,266 పాయింట్లు దూసుకెళ్లిన బీఎస్‌ఈలో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు ఎగసింది. ఇదే ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో నిఫ్టీ 556 పాయింట్లు పెరిగింది. ‘‘చమురు ధరలు దిగివచ్చాయి. యూఎస్‌ ఫెడ్‌  రేట్ల పెంపు దూకుడుగా ఉండకపోవచ్చనే ఆశలు చిగురించాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొంటున్నారు. మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అంశాలతో భారత మార్కెట్‌ 5 ట్రేడింగ్‌ సెషన్లలో 4% ర్యాలీ చేసింది’’ అని మెహతా ఈక్విటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ తాప్సీ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు 
జూన్‌ త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబరచడంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరు 8% లాభపడి రూ.948 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిది శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.961 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన ఈ షేరు ఇదే. 
ఐటీసీ షేరు బీఎస్‌ఈలో అరశాతం లాభపడి రూ.299.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.5% లాభపడి మూడేళ్ల తర్వాత రూ.300 స్థాయిని అధిగమించి రూ.302.20 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వార్షిక సమావేశంలో హోటల్‌ వ్యాపార విభజనతో పాటు తన అనుబంధ సంస్థ టెక్నాలజీ వెంచర్‌ను లిస్టింగ్‌ చేసే అంశాలపై చర్చించడం షేరు ర్యాలీకి కారణమైంది.

మరిన్ని వార్తలు