Stock Market Updates : లాభాలు అందించిన బ్యాంకింగ్‌ షేర్లు

13 Jul, 2021 16:46 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలను కళ్ల జూశాయి.ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపించడంతో  దేశీ స్టాక్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ సంస్థలు ముందుండి మార్కెట్‌ను నడిపించాయి. ఈ రోజు సెన్సెక్స్‌ 52,694 పాయింట్ల వద్ద ప్రారంభమై పైకి ఎగిసింది. ఒక దశలో గరిష్టంగా 5,806 పాయింట్లను టచ్‌ చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి  52,769 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యింది. మొత్తానికి సెన్సెక్స్‌ 397 పాయింట్లు లాభపడింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం  15,794 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత గరిష్టంగా 15,820 పాయింట్లను చేరుకుంది. చివరకు 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది. ఈ రోజు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌, మారూతి సుజూకి, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ సంస్థల షేర్లు నష్టపోయాయి.
 

మరిన్ని వార్తలు