Stock Market Updates: కోలుకున్న స్టాక్‌ మార్కెట్‌

14 Jul, 2021 16:40 IST|Sakshi

ముంబై: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ చివరకు కోలుకుంది. సాయంత్రం 4 గంటలకు  మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 134 పాయింట్లు లాభపడి 52,904 దగ్గర క్లోజయ్యింది. ఉదయం 52,801 దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్‌  ఆ తర్వాత గంట పాటు క్రమంగా పాయింట్లు కోల్పోతూ నష్టపోయింది. అనంతరం ఇన్వెస్టరు ఆసక్తి చూపించడంతో మార్కెట్‌ కోలుకుంది. ఈ రోజు సెన్సెక్స్‌ గరిష్టంగా 15,877 పాయింట్లు తాకింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 15,808 పాయింట్ల దగ్గర మొదలై ఒక దశలో 15,877 గరిష్టానికి చేరుకుంది. చివరకు 41 పాయింట్లు లాభపడి 15,853  పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ షేర్లు లాభపడగా మారుతి సుజూకి, హిందుతస్థాన్‌ యూనిలీవర్‌, నెస్టల్‌ ఇండియా, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఫార్మాలు నష​‍్టపోగా, బ్యాంక్‌  నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. 

మరిన్ని వార్తలు