చిన్న షేర్ల దన్ను- స్మాల్‌ క్యాప్‌ రికార్డ్‌

13 Nov, 2020 13:04 IST|Sakshi

ఏడాది గరిష్టానికి బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌

ఈ జనవరిలో 20,183 వద్ద లైఫ్‌టైమ్‌ గరిష్టానికి

కోవిడ్‌-19 ధాటికి మార్చికల్లా 8,622 పాయింట్లకు పతనం

తాజాగా 15,583కు చేరిన బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌

ర్యాలీ బాటలో ఐబీ రియల్టీ, ఎస్‌టీసీ ఇండియా, గతి, ఐజీ పెట్రో

పుర్వంకారా, ఆప్కోటెక్స్‌, ఎన్‌ఆర్‌బీ, సొమానీ సిరామిక్స్‌, కేర్‌ రేటింగ్స్‌

ముంబై: ఈ ఏడాది ప్రధానంగా చిన్న, మధ్యతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ తాజాగా 52 వారాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ ఇంట్రాడేలో 15,583 పాయింట్ల వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. ప్రస్తుతం 0.75 శాతం పుంజుకుని 15,581 వద్ద కదులుతోంది. ఇంతక్రితం సెప్టెంబర్‌ 17న 15,462 పాయింట్ల వద్ద ఈ ఫీట్‌ సాధించింది. కాగా.. ప్రపంచ దేశాలలో కోవిడ్‌-19 తలెత్తడంతో ఈ ఏడాది జనవరి 15న సాధించిన 20,183 పాయింట్ల లైఫ్‌టైమ్‌ హై నుంచి మార్చి 24కల్లా 8,622 పాయింట్లకు పతనమైంది. తిరిగి ఇటీవల జోరు చూపుతోంది. గత రెండేళ్లలో స్థబ్దుగా ఉన్న చిన్న షేర్లు ఇటీవల ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

షేర్ల ర్యాలీ
బీఎస్ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ర్యాలీకి పలు కౌంటర్లు దోహదపడగా.. నేటి ట్రేడింగ్‌లోనూ కొన్ని షేర్లు దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ 11-5 శాతం మధ్య లాభాల దౌడు తీస్తున్నాయి. జాబితాలో ప్రస్తుతం ఇండియాబుల్స్‌ రియల్టీ 11 శాతం దూసుకెళ్లి రూ. 61ను తాకగా.. ఎస్‌టీసీ ఇండియా 9 శాతం జంప్‌చేసి రూ. 64కు చేరింది. గతి లిమిటెడ్‌ 10 శాతం అప్పర్‌ సర్క‍్యూట్‌ను చేరి రూ.79 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో పుర్వంకారా 6.5 శాతం ఎగసి రూ. 57 వద్ద, ఐజీ పెట్రోకెమికల్స్ 6 శాతం పురోగమించి రూ. 376 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్ 10 శాతం అప్పర్‌ సర్క‍్యూట్‌ తాకి రూ.165 వద్ద ఫ్రీజ్‌కాగా.. కేర్‌ రేటింగ్స్ 5.3 శాతం జంప్ చేసి రూ. 440 ను తాకింది. ఇదే విధంగా ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్ 5 శాతం లాభపడి రూ. 73 వద్ద‌, సొమానీ సిరామిక్స్‌ 6 శాతం పెరిగి రూ. 246 వద్ద ట్రేడవుతున్నాయి. 

మరిన్ని వార్తలు