BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త..!

2 Dec, 2021 21:25 IST|Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తన యూజర్లకు అదిరిపోయే శుభవార్తను అందించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటివరకు కేవలం ఎంపిక చేయబడిన ప్రాంతాలలోనే 4జీ సేవలను అందిస్తోంది. 4జీ సేవలతో దాదాపు 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుందని పార్లమెంటులో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. అన్ని పుకార్లను కొట్టివేస్తూ..బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణపై ఏలాంటి ప్రణాళికలు లేవని లోక్‌సభకు లిఖితపూర్వకంగా దేవుసిన్హ్ చౌహాన్ సమాధానమిచ్చారు.   

పీటీఐ నివేదిక ప్రకారం..రాబోయే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC)ను బీఎస్‌ఎన్‌ఎల్‌  ఆహ్వానించింది. ప్రభుత్వ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌  పునరుద్ధరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రారంభించింది . ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా  బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు 4జీ సేవల స్పెక్ట్రమ్ కేటాయింపులు ఉన్నాయి. దీనికోసం బడ్జెట్‌ కేటాయింపులు వాడనున్నారు. ఆర్థిక నివేదికలోని గణాంకాల ప్రకారం...సెప్టెంబర్ 30, 2021 వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తుల విలువ రూ. 1,33,952 కోట్లు , ఉండగా ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తుల విలువ రూ. 3,556 కోట్లుగా ఉంది. అప్పుల విషయానికి వస్తే..బీఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తం రూ. 85,721 కలిగి ఉంది. ఎంటీఎన్‌ఎల్‌ రూ. 30,159 కోట్ల అప్పు కలిగి ఉంది.
చదవండి: యూజర్లకు భారీ షాకిచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌..!


 

మరిన్ని వార్తలు