బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. మరింత మెరుగ్గా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

15 Jun, 2023 18:47 IST|Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ఫైబర్‌ పేరిట అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించిన కస్టమర్ల కోసం నిరంతర టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

భారత్‌ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్ల కోసం 1800 4444 నెంబర్‌తో 24/7 నిరంతర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ట్విటర్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కస్టమర్లు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా భారత్‌ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా జీ5, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌, సోనీలివ్‌ వంటి ఓటీటీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు