బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు తగ్గాయ్‌

19 Jul, 2021 05:11 IST|Sakshi

క్యూ1లో రూ. 7,441 కోట్లు

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 2 శాతం నీరసించి రూ. 18,595 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 18,907 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా కంపెనీ నెట్‌వర్త్‌ రూ. 59,140 కోట్ల నుంచి రూ. 51,687 కోట్లకు వెనకడుగు వేసింది. కంపెనీ నికర రుణ భారం రూ. 21,675 కోట్ల నుంచి రూ. 27,034 కోట్లకు పెరిగింది.

మరిన్ని వార్తలు