PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!

1 Feb, 2022 20:19 IST|Sakshi

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇల్లు కొనే మధ్య తరగతి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.48,000 కోట్లు కేటాయించింది. 2023 నాటికి దేశంలో సుమారు 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

జనవరి 3 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రాల్లో సుమారు 114.02 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. వీటిలో ఇప్పటి వరకు 53.42 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఆవాస్​ యోజన స్కీమ్​ కింద ఇల్లు కొంటే మీరు భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్​ కింద మీకు ఏకంగా రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. మార్చి 31, 2022 నాటికి అర్హులైన కుటుంబాలు లేదా లబ్ధిదారులకు ఇళ్లు అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నందున ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం వేగంగా అమలవుతోంది. మరోవైపు రూ.60,000 కోట్లతో 3.8 కోట్ల ఇళ్లకు ట్యాప్ వాటర్ ద్వారా మంచినీటిని అందించనుంది ప్రభుత్వం. పట్టణ సామర్థ్యం పెంపుదల, ప్రణాళిక అమలు, పాలన కోసం అర్బన్ ప్లానర్స్, ఎకనమిస్ట్‌లతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనుంది.

(చదవండి: 5జీ టెక్నాలజీతో కేంద్రానికి భారీగా ఆదాయం..!)

మరిన్ని వార్తలు