స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

20 Oct, 2022 15:56 IST|Sakshi

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. గతంలో ఫోన్లు పాడైనప్పుడో , లేదా పోగొట్టుకున్నప్పుడో మాత్రమే యూజర్లు కొత్త వాటిని కొనుగోలు చేసేవాళ్లు. అయితే ఈ ట్రెండ్‌ మారి గత కొన్ని ఏళ్లుగా కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మార్కెట్లో ఫోన్‌ వస్తే చాలు వాటిని కూడా కొనేసి జేబులో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. మరో వైపు దేశంలో 5జీ సేవలు రాకతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ మరింత ఊపందుకుంది. దసరా ,దీపావళి సీజన్‌ కావడంతో కంపెనీలు కూడా తక్కువ ధరలకే అమ్మకాలు జరుపుతున్నాయి. అయితే  తాజా సమాచారం ప్రకారం దీపావళి తర్వాత స్మార్ట్‌ ఫోన్ల ధరలు పెరుగుతాయని సమాచారం. ఎందుకో తెలుసుకుందాం!


 
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, కస్టమర్లకు అభిరుచి అనుగుణంగా,  అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇటీవల 5జీ సేవల వినియోగంలోకి రావడంతో చాలా మంది ముఖ్యంగా యువత తమ స్మార్ట్ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. మరొకొందరు కొత్త ఫోన్లను కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఎలాగూ పండుగ సీజన్‌ రావడంతో ఫెస్టివల్‌ ఆఫర్లలో మంచి ఫోన్‌ను కొనేందుకు రెడీగా ఉన్నారు.


ఈ క్రమంలో కంపెనీలు కూడా వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది గానీ.. దీపావ‌ళి త‌ర్వాత స్మార్ట్ ఫోన్ల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్‌ డిసెంబర మధ్యలో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్లు ధరలు పెరుగుతాయిని తెలస్తోంది. అందుకే కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే ప్లాన్‌ ఉంటే పండుగ సమయంలో తీసుకోవడం ఉత్తమం.

ఎందుకు పెరుగుతున్నాయ్‌
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్లకు కావాల్సిన చాలా విడిభాగాలను కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయి విలువ పడిపోవడంతో వీటి ధరలు పెరుగుతాయన్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఫోన్లపై పడనుంది. దీంతో ఆయా కంపెనీలు ఫోన్ల ధరలను పెంచాల్సి వస్తోంది. అయితే ప్రీమియం ఫోన్లు, మిడ్ బడ్జెట్ ఫోన్ల కంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం రూ.17వేల ఉన్న ఫోన్‌ ధర ఏడాది చివరి నాటికి రూ.20వేలకు చేరే అవకాశం ఉంది.

 

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

మరిన్ని వార్తలు