బుల్లెట్‌ రైలు.. మరో కొత్త మార్గంలో ?

23 Aug, 2021 10:31 IST|Sakshi

జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్‌పూర్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్‌ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్‌పూర్‌ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు.

భారీ నష్టాల్లో రైల్వే
కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్‌ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్‌ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్యాసింజర్‌ రైళ్ల వల్లే
తక్కువ టిక్కెట్‌ చార్జీలతో ప్యాసింజర్‌ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్‌ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. 

ఇదేం చోద్యం
ప్యాసిజంర్‌ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్‌ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్‌ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ  ప్యాసింజర్‌ రైళ్లకు కూడా ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. 

చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్‌ జాగ్రత్త..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు