Iphone 13 Series: ఐఫోన్‌ 13 ఫోన్లపై భారీగా ట్యాక్సులు! మినిమమ్‌ ఎంత అంటే..

19 Sep, 2021 11:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Iphone 13 Series Price In India: 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌' వర్చువల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లు అట్టహాసంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌ సందర్భంగా భారత్‌లో ఐఫోన్‌ 12 సిరీస్‌ ధరలకే.. ఐఫోన్‌ 13 మోడల్స్‌ను విక్రయిస్తామని యాపిల్‌ సంస్థ ప్రకటించింది కూడా. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులు ఐఫోన్‌ 13సిరీస్‌ మోడల్‌ని బట్టి భారీ ఎత్తున ట్యాక్స్‌ పే చేయాల్సి రానుంది. ఈ సిరీస్‌లోని ఒక్కో ఫోన్‌కు మినిమమ్‌ ఇరవై వేల రూపాయల నుంచి గరిష్టంగా రూ.40,034 వరకు పన్నులు చెల్లించాల్సి వస్తుందనేది ఇప్పుడు అంచనా.

 
సెప్టెంబర్‌ 24 నుంచి ఐఫోన్‌13 అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ను భారత్‌లో కొనుగోలు చేస్తే రూ.79,900 చెల్లించాల్సి ఉండగా.. అమెరికాలో రూ.51,310కే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దేశాల మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉండడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

తయారీ యూనిట్లు లేవు
భారత్‌లో యాపిల్‌ ఫోన్లు అమ్మకాలు థర్డ్‌ పార్టీ స్టోర్ల ఆధారంగా అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. దిగుమతుల వల్ల పన్నులూ అదే స్థాయిలో విధించాల్సి వస్తోంది.  ఇప్పుడు ఇదే అంశం భారత్‌లో ఐఫోన్‌ ధరలు భారీగా ఉండటానికి కారణమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి  భారత్‌ కు వచ్చే ఐఫోన్‌ 13(మిని) సిరీస్‌ ఫోన్‌పై కొనుగోలు దారులు కస్టమ్‌ డ్యూటీ  22.5శాతం కింద రూ.10,880 చెల్లించాల్సి ఉంది. కస్టమ్‌ డ్యూటీతో పాటు జీఎస్టీ రూ.10,662గా ఉంది.      


ఏ ఫోన్‌కు ఎంత ట్యాక్స్‌ అంటే..
భారత్‌ లో ఐఫోన్‌ 13 సిరీస్‌ మోడల్‌ను బట్టి ట్యాక్స్‌ పేచేయాల్సి ఉంటుంది. ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ పై రూ.40,034, ఐఫోన్ 13 మినీలో 21,543, ఐఫోన్ 13 పై 24,625, ఐఫోన్ 13 ప్రోపై రూ. 36,952 ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు.

మరిన్ని వార్తలు