కేంద్రం కీలక నిర్ణయం, కొత్త వాహన కొనుగోలు దారులకు షాక్‌!

26 May, 2022 14:51 IST|Sakshi

మీరు కొత్త బైక్‌, కార్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే జూన్‌ 1 నుంచి ప్రస్తుతం ఉన్న ధర కంటే కాస్త ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే నెల నుంచి కేంద్ర రవాణా శాఖ థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ ధరల్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది.దీంతో వాహనాల కొనుగోళ్లు వాహనదారులకు మరింత భారం కానున్నాయి.
 

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..2019 -2020లో ప్రైవేట్‌ కార్‌ ఇంజిన్‌ కెపాసిటీ 1000సీసీ ఉంటే థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం ధర రూ.2,072 ఉండగా ఇప్పుడు రూ.2,094కు చేరింది. 

కార్‌ ఇంజిన్‌ కెపాసిటీ 1000సీసీ, 1500సీసీ మధ్య ఉంటే ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం ధర రూ.3,221 నుంచి రూ.3,416కి చేరింది

అదే కార్‌ 1500సీసీ దాటితే ప్రీమియం ధర రూ.7,890 నుంచి రూ.7,897కి పెరిగింది. 

అదే సమయంలో టూవీలర్‌ ఇంజిన్‌ కెపాసిటీ 150 సీసీ నుండి 350సీసీ ఉంటే 150సీసీ ప్రీమియం ధర రూ.1,366 ఉండగా 350సీసీ ప్రీమియం ధర రూ.2,804గా ఉంది. 

ఇక హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై 7.5శాతం డిస్కౌంట్‌ ఇచ్చిన కేంద్రం.. ఎలక్ట్రిక్‌ కార్‌ 30కేడబ్ల్యూ ఉంటే ప్రీమియం రూ.1,780, 65కేడ్ల్యూ ఉంటే ప్రీమియం ధర రూ.2,904గా నిర్ణయించింది.   

కమర్షియల్‌ వెహికల్స్‌ 12,000కేహెచ్‌ బరువు. కానీ 20,000కేజీ బరువు మించకుండా ఉంటే సవరించిన ప్రీమియం రూ. 35,313 అవుతుంది.  40,000 కిలోల కంటే ఎక్కువ కమర్షియల్ వాహనాలను రవాణా చేసే వస్తువుల విషయంలో ప్రీమియం 2019-20లో రూ. 41,561 నుండి రూ.44,242కి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది

మరిన్ని వార్తలు