Elon Musk: ఐఫోన్ 15పై మనసుపడిన మస్క్.. రీజన్ కూడా చెప్పేసాడుగా!

24 Sep, 2023 17:34 IST|Sakshi

మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విడుదలైనప్పటి నుంచి దానిపై ఉన్న అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అనుకున్న విధంగా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా మస్క్ కూడా ఒక ఐఫోన్ 15 కొనాలని మనసులో మాట చెప్పాడు.

2023 సెప్టెంబర్ 22 నుంచి ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సేల్స్ ప్రారంభించడానికి ముందే ఐఫోన్ లవర్స్ స్టోర్ల ముందు గంటల కొద్దీ పడిగాపులు కాస్తూ ఎదురు చూసారు. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్.. ఫోటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్కేస్, రూబెన్ వుతో కలిసి ఉన్న ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఫోటోగ్రాఫర్‌లకు ఐఫోన్ పనిని చూపించడం కనిపిస్తుంది. ఇందులో రోడ్ ఐలాండ్‌లోని వేసవి అందం నుంచి ఉటాలోని ఇతర ప్రపంచ ఎడారుల వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను ఇక్కడ గమనించవచ్చు.

ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు..

దీనిపైన ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఐఫోన్ ఫోటోలు & వీడియోల అందం అపురూపంగా ఉందని అన్నారు. తాను కూడా ఒకటి కొనబోతున్నట్లు ట్వీట్ చేసాడు. దీనికి కొంతమంది ఏ మోడల్ కొనబోతున్నావు, ఏ కలర్ ఎంచుకోబోతున్నావని అడుగుతున్నారు. అయితే మస్క్ ఐఫోన్ 15 కొంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు