అక్కడ స్థలాలు కొనాలంటే మరింత కాసులు విదిల్చాల్సిందే

1 Jun, 2022 18:44 IST|Sakshi

ఆస్తులు కొనే ప్లాన్‌లో ఉన్నవారు పునరాలోచనలో పడే నిర్ణయం తీసకుంది ఢిల్లీ సర్కారు. అకస్మాత్తుగా ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఢిల్లీ 2022 మే 31న ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ కార్పోరేషన్‌ పరిధిలో జూన్‌ 1 నుంచి ప్రాపర్టీల ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి పన్నులు పెరగనున్నాయి.

ఢిల్లీ కార్పోరేషన్‌ తాజాగా తీసుకున్న నిర్ణయంతో  1 శాతం మేర ట్రాన్స్‌ఫర్‌ పన్ను పెరిగింది. ప్రాపర్టీ విలువ రూ. 25 లక్షలు దాటిన వాటికి ఈ కొత్త పెంపు వర్తిస్తుంది. ఇప్పటి వరకు పురుషులకు అయితే 3 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫర్‌ పన్ను 4 శాతానికి పెరగగా స్త్రీలకు 2 శాతం నుంచి 3 శాతానికి చేరుకుంది. ప్రాపర్టీ మొత్తం విలువ ఆధారంగా ట్రాన్స్‌ఫర్‌ పన్నును విధిస్తారు. 

చదవండి: ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు

మరిన్ని వార్తలు