Byju's Revenue 2021: ఈ ఏడాది బైజూస్‌ ఆదాయం ఎంతో తెలుసా?

28 Aug, 2021 21:31 IST|Sakshi

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌గా మొదలైన బైజూస్‌ సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. బైజూస్‌ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ ప్రతీ అడుగు ఓ విశేషంగానే నిలిచింది. తాజాగా మరో సంచలన విషయం ప్రకటించారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌. 

వేల కోట్ల ఆదాయం
ఈ ఏడాది బైజూస్‌ సంస్థ రెవిన్యూ రూ. 10,000 కోట్ల రూపాయలు ఉండవచ్చంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ పేర్కొని సంచలనం సృష్టించారు. ఎడ్యుటెక్‌కి సంబంధించి తాము అనేక కొత్త కంపెనీలను కొనుగోలు చేశామని, అవన్నీ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయన్నారు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే రూ, 10,000 కోట్ల రెవిన్యూపై 20 నుంచి 23 శాతం మార్జిన్‌ ఉంటుందని చెప్పారు. దీంతో బైజూస్‌ సంస్థ ఆదాయం రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,3,00 కోట్ల మధ్యన ఉండవచ్చంటూ అంచనా వేశారు. 

బ్రాండ్‌ వాల్యూలోనూ రికార్డ్‌ 
కంపెనీ ఆదాయ వివరాలే కాదు బ్రాండ్‌ వాల్యూలో కూడా మిగిలిన కంపెనీలకు అందనంత జెట్‌ స్పీడ్‌తో బైజూస్‌ దూసుకుపోతుందని రవీంద్రన్‌ అంచనా వేశారు. రాబోయే రెండేళ్లలో అంటే 2023 నాటికి బైజూస్‌ సంస్థల బ్రాండ్‌ విలువ రూ. 30,000 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు.  
 

చదవండి: భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు

మరిన్ని వార్తలు