అమ్మకాల ప్రక్రియను మార్చుకున్న బైజూస్‌

17 Jan, 2023 07:21 IST|Sakshi

రూ.25వేలకుపైన ఆదాయం ఉన్న వారికే కోర్సులు 

హైదరాబాద్‌: బైజూస్‌ తన వ్యాపార విక్రయ విధానంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుత డైరెక్ట్‌ విక్రయాల స్థానంలో నాలుగు అంచెల టెక్నాలజీ ఆధారితిత విక్రయాల ప్రక్రియను ప్రవేశపెట్టింది. తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులను విక్రయించకుండా నూతన విధానం అ­డు­్డకుంటుందని బైజూస్‌ తెలిపింది. చిన్నా­రులు, వారి తల్లిదండ్రులతో తన కోర్సులను కొనుగోలు చేయించేందుకు బైజూస్‌ తప్పుడు మార్గాలను అనుసరిస్తోందన్న ఆరోపణలపై.. బాలల హక్కుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

నూతన విక్రయ నమూనా కింద.. బైజూస్‌ కోర్సులను కొనుగోలు చేయాలంటే నెలవారీ కనీసం ఆదాయం రూ.25,000 ఉండాలి. కోర్సు కొనుగోలుకు ముందు తల్లిదండ్రులు సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, నూతన విక్రయ విధానంలో ఉత్పత్తికి సంబంధించి, రిఫండ్‌ పాలసీ (వద్దనుకుంటే తిరిగి చెల్లింపులు) గురించి వివరంగా కస్టమర్‌కు జూమ్‌ లైవ్‌ సెషన్‌లో బైజూస్‌ తెలియజేస్తుంది. దీన్ని భవిష్యత్తులో ఆధారం కోసం రికార్డు రూపంలో ఉంచుతుంది.

చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు!

మరిన్ని వార్తలు