క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?

22 Sep, 2023 15:00 IST|Sakshi

తమిళనాడులోని పళనికి చెందిన  రాజ్‌కుమార్‌  అనే  డ్రైవర్‌కి ఉన్నట్టుండి తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు డిపాజిట్‌ అయింది. ఒకటి కాదు  రెండు కాదు ఏకంగా 9 వేల కోట్ల జమ కావడంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.   తరువాత విషయం తెలుసి సంబరాలు చేసుకునేలోపే  జరిగిన పరిణామానికి ఉసూరు మన్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలోని క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్‌ ఎదురైనా అనుభవం ఇది.  ఇంతకీ ఏమైంది అంటే..

రాజ్‌కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి  తన  ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్  కావడంతో ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అతని  ఖాతాలో రూ.105 మాత్రమే ఉంది. ఆ తరువాత ఇదేదో స్కాం అనుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఒకసారి టెస్ట్‌ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. లావాదేవీపూర్తియిందా లేదా ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆశ్చర్యంగా.. ట్రాన్సాక్షన్‌ కంప్లీట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఇది నిజమేనని నిర్ధారించుకున్నాక  ఎగిరి గంతేశాడు. 

కానీ అరగంటలోనే ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. మరుసటి రోజు ఉదయం  తూత్తుకుడి బ్యాంకు  అధికారులు రంగంలోకి దిగారు.  పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని ఫ్రెండ్‌కి ట్రాన్సఫర్‌ చేసిన సొమ్ము మొత్తం అప్పగించాల్సిందేని డిమాండ్‌ చేశారు. దీంతో కంగు తిన్న రాజ్‌కుమార్‌  లాయర్లతో  బ్యాంకు అధికారులతో సం‍ప్రదింపులు చేశాడు. చివరికి రూ. 21 వేలను వాహనరుణంగా సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు