DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

28 Sep, 2022 15:24 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్‌ అలవెన్స్‌(డీఏ)ను పెంచుతూ కేబినెట్‌ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెరిగిపోతున్న ధరల కారణంగా డేర్‌నెస్‌ అలవెన్స్‌ పెంచుతూ మోదీ ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ అలవెన్స్‌ పెరిగింది.

కేబినెట్‌ తాజా నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వీరితో పాటు సివిలియన్‌ ఎంప్లాయిస్, డిఫెన్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు సైతం డీఏ అలవెన్స్‌ వర్తించనుంది. 

ఇక కేంద్రం పెంచిన డీఏ అలవెన్స్‌ ఈ ఏడాది జులై 1 నుంచి లబ్ధి దారులు పొందవచ్చు. జులై 1 నుంచి ఉద్యోగులు తీసుకున్న శాలరీస్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలు (arrears) సైతం చెల్లిస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్ర మంత్రి వర్గ కీలక నిర్ణయాలు
 
గరిబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో మూడు నెలలు పొడిగింపు

డిసెంబర్ 2023 వరకు పథకం పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు 4 శాతం డీ ఎ పెంపు

ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 10వేల కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం 

మరిన్ని వార్తలు