రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌!

18 Oct, 2021 19:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం రైతులకు పండుగ ముందు తీపికబురు అందించింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని కేంద్రం భారీగా పెంచింది. ప్రస్తుతం యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200  నుంచి రూ.1650కి, ఎన్‌పీకే ఎరువుపై ఇస్తున్న రాయితీ ధర రూ.900 నుంచి రూ.1015కి, ఎన్‌ఎస్ పీపై ఇస్తున్న రాయితీ ధరను రూ.315 నుంచి రూ.375కి పెంచింది. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28వేల కోట్ల భారం పడనుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని కేంద్ర మంత్రి వివరించారు.(చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!)

మరిన్ని వార్తలు