ఈ–కామర్స్‌ నియంత్రణకు వ్యవస్థ: సీఏఐటీ డిమాండ్‌

26 Dec, 2022 06:38 IST|Sakshi

న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్‌ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

సెబీ, ఆర్‌బీఐ మాదిరిగా ఈ–కామర్స్‌ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండెల్వాల్‌ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్‌ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్‌ పాలసీ–2018 ప్రెస్‌ నోట్‌–2 స్థానంలో కొత్త ప్రెస్‌ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్‌ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది.

మరిన్ని వార్తలు