గూగుల్‌పై 73 లక్షల కోట్ల జరిమానా

13 Dec, 2020 19:39 IST|Sakshi

అమెరికా ప్రభుత్వం గూగుల్ పై కేసు వేసింది. సెర్చ్, యాడ్స్ విషయంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని పెంపొందించడానికి యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది. దీనికి సపోర్ట్ గా కాలిఫోర్నియా డెమొక్రాట్ రాష్ట్ర అటార్నీ జనరల్ ‌బహిరంగంగా మద్దతునిచ్చారు. టెక్ దిగ్గజం గూగుల్‌పై 1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.73,73,830 కోట్లు) జరిమానా విధించాలని గతంలో 11 ఇతర రాష్ట్రాలు కోర్టును కోరాయి. (చదవండి: 10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్ అండ్ ట్రిక్స్)

గూగుల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. సెర్చ్ ఇంజిన్, యాడ్స్ విషయంలో వినియోగదారులు అభిప్రాయాలను బట్టి మారుతుంటాయని తెలిపింది. గూగుల్ ని ప్రజలు ఎవరో బలవంతం చేయడం వల్ల ఎంచుకోరు. వారికీ ఇష్టమైతే వచ్చి సెర్చ్ చేస్తారు అని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మేము కోర్టులో మా కేసును కొనసాగిస్తాము అని తెలిపారు. డిసెంబర్ 18వ రాబోయే విచారణకు కంపెనీ తప్పక స్పందించాలని ఈ కేసులో న్యాయమూర్తి అమెరికా జిల్లా జడ్జి అమిత్ మెహతా తెలిపారు. గూగుల్ ఇతర సంస్థల వ్యాపార పద్ధతుల్లో మార్పులను బలవంతం సూచిస్తోందని, అదే దావా వేసేందుకు ప్రధాన కారణంగా అమెరికా ప్రభుత్వం తెలిపింది. గతంలో యూరోపియన్ యూనియన్ లో కూడా ఇదే కారణంతో గూగుల్ పై జరిమానాలు విధించారు. అయితే ఆ కేసులను గూగుల్ సవాలు చేసింది.

>
మరిన్ని వార్తలు