నిధుల సేకరణే లక్ష్యం..ఐపీవోకు సిద్ధమైన ప్రముఖ ఫుట్‌వేర్‌ కంపెనీ..!

21 Apr, 2022 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పోర్ట్స్, అథ్లెస్యూర్‌ ఫుట్‌వేర్‌ కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 4.79 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 25న షేర్ల జారీని చేపట్టనున్నట్లు క్యాంపస్‌ తాజా ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది.

ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.21% వాటా ఉంది. టీపీజీ గ్రోత్‌ 17.19%, ఓఆర్‌జీ ఎంటర్‌ప్రైజెస్‌కు 3.86 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. కంపెనీ 2005లో క్యాంపస్‌ బ్రాండును మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్, అథ్లెస్యూర్‌ ఫుట్‌వేర్‌ విభాగంలో 2020కల్లా విలువరీత్యా ఈ బ్రాండు 15% మార్కెట్‌ వాటాను సాధించింది.

చదవండి: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు!

మరిన్ని వార్తలు