ఐపీవో బాటలో క్యాంపస్‌ షూస్‌, గోదావరీ బయో..!

20 Apr, 2022 12:58 IST|Sakshi

మే నెలకల్లా క్యాంపస్‌ షూస్‌ రెడీ 

త్వరలో గోదావరీ బయోరిఫైనరీస్‌  

బడ్డీ/న్యూఢిల్లీ: స్పోర్ట్స్, అథ్లెస్యూర్‌ ఫుట్‌వేర్‌ కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ ఈ ఏడాది మే నెలకల్లా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజాగా పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణతోపాటు, దేశ పశ్చిమ, దక్షిణాది మార్కెట్లలో కార్యకలాపాలను మరింత పటిష్టపరచుకోవాలని చూస్తోంది. టీపీజీ గ్రోత్‌ ఈక్విటీ ఫండ్, ఓఆర్‌జీ ఎంటర్‌ప్రైజస్‌లకు పెట్టుబడులున్న కంపెనీ అధిక మార్జిన్లుగల మహిళలు, పిల్లల ఫుట్‌వేర్‌ పోర్ట్‌ఫోలియోను సైతం ఆవిష్కరించే ప్రణాళికల్లో ఉన్నట్లు క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ సీఎఫ్‌వో రామన్‌ చావ్లా పేర్కొన్నారు.   

గోదావరీ బయో.. 
ఇథనాల్, బయో ఆధారిత కెమికల్స్‌ తయారీ కంపెనీ గోదావరీ బయోరిఫైనరీస్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు గతేడాది నవంబర్‌లోనే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సమీర్‌ సోమారియా తెలియజేశారు. లిస్టింగ్‌కు ఏడాది సమయం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో తగిన సమయంలో కంపెనీ ఐపీవోను చేపట్టే వీలున్నట్లు తెలియజేశారు.
 

చదవండి: అదరగొట్టిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు