గ్రేటర్‌ హైదరాబాద్‌లో కెనడా విల్లా

20 Sep, 2022 19:40 IST|Sakshi

నిర్మాణంలో చెక్క వినియోగం

ఎక్కువ కాలం మన్నేలా సాంకేతిక నైపుణ్యం

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నాళ్లు సినిమాల్లో కనిపించిన చెక్క ఇళ్లు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేశాయి. అచ్చం కెనడా, అమెరికాలో కనిపించే ఇళ్ల తరహాలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నిర్మించారు. తుమ్మలూర్ రెవెన్యూ పరిధి హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పక్కన మ్యాక్‌ ప్రాజెక్ట్స్‌లో ఈ కెనడియన్ వుడ్ విల్లాలను నిర్మించారు. అధునాతన నిర్మాణ పద్ధతిలో, ఎక్కువ శాతం చెక్కను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. అడవులకు వీలైనంత వరకు హాని కలిగించకుండా.. ప్రత్యేకంగా పెంచిన చెట్లనుంచి చెక్క సేకరించి నిర్మాణం కోసం వాడారు. ఈ కెనడియన్ వుడ్ విల్లాను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కెనడా హైకమిషనర్ కెమెరాన్ మాకే హాజరయ్యారు. 

కెనడియన్‌ విల్లాల నిర్మాణం చేపడుతున్న మ్యాక్ ప్రాజెక్ట్స్‌ మేనేజింగ్ డైరక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ తమ ప్రాజెక్ట్‌ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభం కాగా కేవలం 12నెలలోనే ఇళ్ల నిర్మాణం పూర్తికావడం విశేషమని తెలిపారు. బ్రిటిష్ కొలంబియా కెనడా ధృవీకరించిన కలపతో విల్లాను నిర్మించామని తెలిపారు. కెనడియన్ వుడ్‌తో మ్యాక్ ప్రాజెక్ట్ కలిసి భాగస్వామ్యం కావడం విశేషమన్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు శివారు ప్రాంతాలకు విస్తరిస్తోందని, బంగారు భవిష్యత్తుకు విల్లాలను కొనుగోలు చేయడమే మంచిదన్నారు.

చదవండి: (వ‌న్‌ప్ల‌స్ దివాలీ సేల్‌.. కళ్లు చెదిరే డీల్స్‌)

మరిన్ని వార్తలు