ఘనంగా కెనరా బ్యాంక్‌ 117వ వ్యవస్థాపక దినోత్సవం

21 Nov, 2022 07:40 IST|Sakshi

బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బెంగళూరు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ వ్యవస్థాపకుడు దివంగత అమ్మెంబళ్‌ సుబ్బారావు పాయ్‌కు ఘనంగా నివాళులర్పించారు. బ్యాంక్‌ 117 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణాన్ని విజవంతంగా పూర్తి చేసుకోవడంలో ఖాతాదారుల పాత్ర అమోఘమైందని బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ తెలిపారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా క్యూర్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా ట్రస్ట్‌కు ఆర్థిక చేయూతను అందించినట్లు తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ చిరంతనకు కూడా ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్‌ చేస్తాం..అదే కారు కావాల్సిందే’

మరిన్ని వార్తలు