ATM cash withdrawal limit: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు

5 Dec, 2022 21:14 IST|Sakshi

కెనరా బ్యాంక్‌ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రాల్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌), ఈకామర్స్‌ ట్రాన్సాక్షన్‌లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది 

► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్‌డ్రాల్‌ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. 

► ప్రస్తుతం ఉన్న పీఓఎస్‌,ఈ కామర్స్‌ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

► రూ.25వరకు లిమిట్‌ ఉన్న ఎన్‌ఎఫ్‌సీ (కాంటాక్ట్‌లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్‌బీ వెబ్‌సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌ కార్డుల వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. థర్డ్‌ పార్టీ పద్దతుల ద్వారా రెంట్‌ పేమెంట్‌ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్‌ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం?

మరిన్ని వార్తలు